Jr NTR Upcoming movies lineup : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో Dragon సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ లో షూటింగు శరవేగంగా జరుగుతుంది.. డ్రాగన్ సినిమాని మేకర్స్ 2027 లో విడుదలకు సిద్ధం చేశారు. అయితే ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ త్రివిక్రమ్ దర్శకత్వంలో గాడ్ ఆఫ్ వార్ మొదలు పెడతారని అనుకున్నారు కానీ ఎవరు ఊహించని విధంగా నిన్న ఇంకొక మూవీ ని జూనియర్ ఎన్టీఆర్ అనౌన్స్ చేయడం జరిగింది. ప్రస్తుతం తారక్ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ చూస్తే భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతోంది.
Jr NTR Upcoming Lineup Movies List
Prashanth Neel – Dragon: 2027 Release
Trivikram – God Of War: Release Dateపై ఇంకా క్లారిటీ లేదు.
NTR x Anil Ravipudi: 2028 సంక్రాంతి టార్గెట్.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. God Of War ఒక మైథలాజికల్ మూవీ కావడంతో షూటింగ్‌తో పాటు VFX పనులకు కూడా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2027లో షూటింగ్ ప్రారంభించి, 2028 మధ్యలో లేదా చివర్లో విడుదల చేసే అవకాశం ఉందని అంచనా.
ఇక అనిల్ రావిపూడి సినిమాల విషయానికి వస్తే.. ఆయన తక్కువ సమయంలోనే సినిమాలను పూర్తి చేయడంలో మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. మూడు నెలల్లోనే సినిమా పూర్తి చేసే సామర్థ్యం ఆయనకు ఉందనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది.
అందుతున్న సమాచారం ప్రకారం, తారక్ ఈ రెండు సినిమాల షూటింగ్స్‌ను 2027లో ప్రారంభించి, 2028లో విడుదలకు సిద్ధం చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. అనిల్ రావిపూడి సినిమాకు తారక్ లుక్ పూర్తిగా డిఫరెంట్‌గా ఉండాల్సి ఉంటుంది. మరి ముందుగా ఏ సినిమాను ప్రారంభిస్తారు? ఏది తర్వాత సెట్స్‌పైకి వెళ్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు NTR Arts బ్యానర్‌పై సినిమా చేయడంపై కొంతమంది అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఎందుకో తెలియదు కానీ మొదటి నుండి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్టీఆర్ సినిమాలు చేయటం చాలామంది ఫ్యాన్స్ కి నచ్చలేదు.. అది అప్డేట్స్ ఇవ్వకపోవడం లేదంటే సరైన పద్ధతులను తీయటం అనేది తెలీదు.
ఇదే సమయంలో సోషల్ మీడియాలో మరో ఆసక్తికరమైన రూమర్ ప్రచారంలో ఉంది. అనిల్ రావిపూడి సినిమాను భారీ తక్కువ బడ్జెట్ తో త్వరగా పూర్తి చేసి బిజినెస్ ద్వారా వచ్చే మొత్తాన్ని Trivikram సినిమా కోసం ఉపయోగించాలనేది ఆ ప్రచారంలో ఉన్న టాక్.
అయితే ఇవన్నీ ప్రస్తుతానికి ప్రచారంలో ఉన్న వార్తలు, రూమర్లు మాత్రమే. అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా, 2027–28లో తారక్ నుంచి వరుసగా మూడు భారీ ప్రాజెక్ట్స్ వస్తే అభిమానులకు పండగే
Jr NTR Upcoming movie latest News and shooting updates