Sara Arjun under consideration for RC17 heroine : ‘రంగస్థలం’ తర్వాత రామ్ చరణ్–సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘RC17’పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం సుకుమార్ స్క్రిప్ట్‌తో పాటు నటీనటుల ఎంపికపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
హీరోయిన్‌గా గతంలో కియారా అద్వానీ పేరు వినిపించినప్పటికీ, ఈసారి కొత్త జోడీని తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు టాక్. ఈ నేపథ్యంలో ‘ధురంధర్’ ఫేమ్ సారా అర్జున్‌ను రామ్ చరణ్ సరసన కథానాయికగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
చరణ్–సారా జోడీ తెరపై కొత్తగా, ఫ్రెష్‌గా కనిపిస్తుందని టీమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సారా అర్జున్ ఎంపిక ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు.
ప్రస్తుతం చరణ్ విశ్రాంతిలో ఉండటంతో సుకుమార్ స్క్రిప్ట్, కాస్టింగ్ పనులపై దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. హీరోయిన్ విషయంలో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.