పుష్ప బ్లాక్‌బస్టర్ అయిన తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పాకిన విషయం తెలిసిందే. ప్రతిరోజూ సోషల్ మీడియాలో తన పేరు మీద ఏదో ఒక వార్త, తన రాబోయే సినిమాల గురించి ఏదో ఒక ప్రచారం జరుగుతూనే ఉంటుంది. అంతేకాకుండా, తను చేసే కాంబినేషన్లు కూడా అలాంటివే ఎక్కువగా ఉంటాయి.
ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో Raaka సినిమా చేస్తున్న అల్లు అర్జున్, తన నెక్స్ట్ సినిమా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేసేందుకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలుపెట్టారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ముంబైలో Raaka సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా, మొదట సింగిల్ పార్ట్‌గా అనుకున్న Raaka సినిమా ఇప్పుడు రెండు పార్టులుగా వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
అయితే, దీని తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా రూమర్స్ జరుగుతూనే ఉన్నాయి. అయితే, ప్రస్తుతం AA23 సినిమా ఆగిపోయిందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు స్క్రిప్ట్ పరంగా బడ్జెట్ పెరిగిందని, అందువల్లే మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ఆపేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
అయితే, బన్నీ టీమ్ ఇచ్చిన క్లారిటీతో సినిమా నిలిచిపోయిందనే ప్రచారానికి తెరపడినట్లయింది. అల్లు అర్జున్‌కు పాన్ ఇండియా స్థాయిలో ఉన్న క్రేజ్, లోకేష్ కనగరాజ్‌కు యాక్షన్ సినిమాల దర్శకుడిగా ఉన్న గుర్తింపు కారణంగా AA23పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి కలయికలో సినిమా వస్తుందనే ప్రకటన నుంచే అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి వచ్చే ప్రతి వార్త ప్రాధాన్యత సంతరించుకుంటోంది.
ప్రస్తుతం సినిమా ఆగిపోలేదనే క్లారిటీ వచ్చినప్పటికీ.. షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? సినిమా పురోగతిపై మేకర్స్ ఎప్పుడు అధికారిక ప్రకటన చేస్తారు? అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అధికారికంగా చిత్రబృందం నుంచి వచ్చే అప్‌డేట్‌తోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Allu Arjun Lokesh Kanagaraj AA23 Movie Latest Update in Telugu