Kaaka VS Vishwambhara Release dates clash: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ మరోసారి కలిసి ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. రవితేజ అలాగే చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా పర్ఫెక్ట్ గా ఎమోషన్స్ యాక్షన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాయి.. దానితో సినిమా సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ అవటమే కాకుండా బాక్సాఫీస్ పరంగా కూడా చిరంజీవికి ఒక న్యూ రికార్డును క్రియేట్ చేసింది..

గత సినిమా సంక్రాంతి సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ బాబీ ఈసారి కూడా ‘KAAKA’ సినిమాను 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఎలాంటి ఆలస్యం లేకుండా పనులు పూర్తి చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించి ముఖ్యంగా విశ్వంభర (Vishwambhara) తో క్లాష్‌ను తప్పించుకునేందుకు వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ, బాబీ మాత్రం సినిమా పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయడంపైనే ఫోకస్ పెట్టారు.

తాజాగా చిత్ర యూనిట్ నుంచి వచ్చిన అప్‌డేట్ ప్రకారం.. ‘కాకా’ డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దర్శకుడు బాబీ, ఆయన టీమ్ ఈరోజు పూజా కార్యక్రమంతో డబ్బింగ్ పనులను మొదలుపెట్టారు. దీనిని బట్టి చూస్తే దర్శకుడు బాబి అలాగే ప్రొడ్యూసర్స్ కాక సినిమాని కూడా సంక్రాంతికి తీసుకురావాలని ఫిక్స్ అయినట్టు అర్థమవుతుంది. అంటే సినిమాకు ఇంకా దాదాపు మూడు నెలల సమయం మాత్రమే ఉంది.

డబ్బింగ్‌తో పాటు షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మిగిలిన షూటింగ్‌ను నవంబర్ నాటికి పూర్తి చేసి, చివరి నిమిషంలో ఎలాంటి టెన్షన్స్ లేకుండా సినిమాను సిద్ధం చేయాలని బాబీ ప్రస్తుతం ఫోకస్ చేస్తున్నారు.

అయితే వశిష్ట దర్శకత్వంలో వస్తున్న విశ్వంభరా సినిమా గత సంవత్సరం నుంచి రెండుసార్లు పోస్ట్ పోన్ అయిన విషయం తెలిసిందే.. మరి ఈసారైనా సంక్రాంతికి విడుదల చేస్తారా లేదంటే తర్వాత వస్తుందా అనేది వేచి చూడాల్సిందే.. లేదంటే అన్ని రికార్డులను బద్దలు కొట్టడానికి సంక్రాంతికి చిరంజీవి (Chiranjeevi) రెండు సినిమాలతో వస్తారా అనేది కూడా ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన KAAKA ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచింది. దీంతో సినిమాపై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2027 జనవరి 13న ‘కాకా’ థియేటర్లలోకి రానుంది.