Alias Rukmini vs Vrushakarma Clash at box office: టాలీవుడ్‌లో సినిమాల పోటీ ఒకేరోజు రిలీజ్ అవ్వటం అనేవి ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి కానీ ఈసారి డిసెంబర్ సినిమా విడుదలల సందడి రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. నితిన్ హీరోగా నటిస్తున్న ‘అలియాస్ రుక్మిణి’ డిసెంబర్ 4న విడుదలవుతున్నట్టు ప్రకటించడం జరిగింది అయితే ఇప్పటికే నాగ చైతన్య నటిస్తున్న ‘వృషకర్మ’ కూడా అదే రోజున విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో డిసెంబర్ మొదటి వారాంతంలో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ కనిపించే అవకాశాలు ఉన్నాయి.
సినిమాల రిలీజ్ షెడ్యూల్‌లో మార్పులు కూడా ఈ పోటీకి కారణమవుతున్నాయి. ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వస్తుందని గతంలో అంచనాలు ఉండగా, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా తన ముందుగా అనుకున్న విడుదల తేదీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో డిసెంబర్‌లో ఏర్పడిన ఖాళీని ఇతర సినిమాలు ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి.
నితిన్‌కు ‘అలియాస్ రుక్మిణి’ విడుదల తేదీ కీలకంగా మారనుంది. అదే సమయంలో నాగ చైతన్య ‘వృషకర్మ’ కూడా ఇదే తేదీకి రావడంతో రెండు సినిమాల మధ్య ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే పోటీ ఉండే అవకాశం ఉంది. అయితే, చివరికి ఎన్ని సినిమాలు అనుకున్న తేదీలకే వస్తాయి, వాటికి ఎన్ని థియేటర్లు అందుబాటులో ఉంటాయనే అంశాలపై ఈ పోటీ తీవ్రత ఆధారపడి ఉంటుంది.
ప్రస్తుత పరిస్థితులను చూస్తే డిసెంబర్ 4న టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి ఎక్కువగానే ఉండేలా కనిపిస్తోంది. టాలీవుడ్‌లో రిలీజ్ డేట్‌ను ప్రకటించడం ఒక ఎత్తయితే, పోటీ పెరుగుతున్నా అదే తేదీకి సినిమాను విడుదల చేయడం మరో ఎత్తు.. మరి ఈసారి నాగచైతన్య అలాగే నితిన్ పోటీ పడటం ఖాయం అంటారా ?