యువ సామ్రాట్ నాగచైతన్య ప్రతిష్టాత్మక మైథలాజికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 4న థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘వృషకర్మ’ ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు సిద్ధమవుతోంది.

తాజాగా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ద్వారా ‘వృషకర్మ’ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో దిల్ రాజు అసోసియేషన్ సినిమాపై ఆయనకున్న నమ్మకాన్ని, ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్‌పై ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తోంది.

ఈ సినిమా ప్రొడక్షన్ స్కేల్ కూడా ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది. కథలోని కీలక భాగం కోసం భారీ స్థాయిలో నిర్మించిన గుహ సెట్‌ను చూపిస్తూ ఆదివారం మేకర్స్ విడుదల చేసిన వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ జానర్ అడ్వెంచర్‌కు అవసరమైన విజువల్ వరల్డ్‌ను సృష్టించేందుకు టీమ్ ఎంతటి శ్రమ తీసుకుందో ఈ సెట్ తెలియజేస్తోంది. ఇప్పటికే విడుదలైన బీటీఎస్ గ్లింప్స్, పోస్టర్లు సినిమాపై మంచి ఆసక్తిని పెంచాయి.

ఈ సినిమాలో నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, స్పర్శ్ శ్రీవాస్తవ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. రగుల్ డి హెరియన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అజనీష్ బి. లోక్‌నాథ్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్, నవీన్ నూలి ఎడిటింగ్ .

నాగచైతన్య కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా, ఆయన కెరీర్‌లోనే అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్‌ను కూడా సాధించింది. ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ ‘వృషకర్మ’పై పాజిటివ్ బజ్ నెలకొంది. సినిమా రిలీజ్‌కు ముందు భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

Dil Raju’s SVC Acquires AP, TG & Karnataka Theatrical Rights Vrushakarma