విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘జనవరి 12 విడుదల’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. ఇప్పటికే వెంకటేష్, కల్యాణ్ రామ్, కృతిశెట్టి ఫస్ట్ లుక్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.

తాజాగా, హీరోయిన్ కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఆమె పోషిస్తున్న లతారెడ్డి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో కీర్తి సురేష్ రస్టిక్ లుక్‌లో చిరునవ్వుతో ఆకట్టుకుంటున్నారు. వైబ్రెంట్ పర్పుల్ కలర్ ట్రెడిషనల్ దుస్తులు, తలకు స్కార్ఫ్, కళ్లకు సన్‌గ్లాసెస్ ధరించి.. ట్రాక్టర్‌పై ఎంతో ధీమాగా కూర్చున్న ఆమె లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కీర్తి సురేష్ కెరీర్‌లోనే అత్యంత ఆసక్తికరమైన, వినోదాత్మకమైన పాత్రల్లో లతారెడ్డి ఒకటిగా నిలవనుంది.

Keerthy Suresh First Look Poster From January 12 Vidudala and Shooting Update
Keerthy Suresh First Look Poster From January 12 Vidudala and Shooting Update

ప్రస్తుతం ఊటీలో సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ప్రధాన తారాగణమంతా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. అనిల్ రావిపూడి నుంచి ఫుల్ ఫన్‌తో కూడిన ఫ్యామిలీ ఫెస్టివల్ ఎంటర్‌టైనర్ సిద్ధమవుతోంది.

ఈ చిత్రానికి జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తుండగా, సమీర్ రెడ్డి డీవోపీ, తమ్మిరాజు ఎడిటర్‌గా, ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి సీజన్ అనిల్ రావిపూడికి సక్సెస్‌ఫుల్ విండోగా నిలుస్తూ వస్తోంది. తన సినిమాలను వరుసగా ఫెస్టివ్ సీజన్‌లో విడుదల చేస్తూ బలమైన కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌ను అందించిన అనిల్ రావిపూడి.. ఈసారి ‘జనవరి 12 విడుదల’తో అద్భుతమైన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ అందించబోతున్నారు

Keerthy Suresh Birthday Special Poster From January 12 Vidudala and Shooting Update