టాలీవుడ్ టాప్ హీరోయిన్ కీర్తి సురేష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా కనబడుతుంది.. ఒకవైపు వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న జనవరి 12న విడుదల చేస్తుండగా మరోవైపు విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్గా చేస్తుంది. అంతేకాకుండా మరో రెండు మూడు సినిమాలు కూడా అనౌన్స్మెంట్ కి సిద్ధంగా ఉన్నాయి ప్రస్తుతం కీర్తి సురేష్ రెండు సినిమాల షూటింగ్లో బిజీగా ఉంది.
స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్న క్రేజీ మూవీ “రౌడీ జనార్థన”. స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రవికిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేష్ నాయికగా నటిస్తోంది. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా “రౌడీ జనార్థన” సినిమా రూపొందుతోంది.

ఈ రోజు హీరోయిన్ కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విశెస్ చెబుతూ “రౌడీ జనార్థన” సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో కీర్తి సురేష్ ట్రెడిషనల్ లుక్ లో బ్యూటిఫుల్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. “రౌడీ జనార్థన” సినిమాను సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు రౌడీ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ డిసెంబర్ లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
Keerthy Suresh’s Birthday Special Poster Unveiled from Vijay Deverakonda’s Rowdy Janardhana