Jr NTR x Trivikram x Nelson Dilipkumar: టాలీవుడ్ మాస్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్‌లో భుజానికి గాయం కావడంతో గత నెల రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్, రెండు రోజుల క్రితమే తిరిగి ‘డ్రాగన్’ (Dragon Shooting) సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ గ్లింప్స్ ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.

అయితే గత కొద్ది రోజులుగా డ్రాగన్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గాడ్ ఆఫ్ వార్’ చేస్తారని అందరూ అనుకున్నారు.. కానీ నిన్న సడన్గా త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా నిర్మిస్తున్న సితార ఎంటర్టైన్మెంట్ నిర్మాత నాగ వంశీ నెల్సన్ – ఎన్టీఆర్ సినిమా ఉంటుందని కన్ఫామ్ చేయటంతో సోషల్ మీడియాలో ఒక చర్చకు దారి తీసింది..

అయితే ఎన్టీఆర్ లైన్ అప్ లో నెల్సన్ (Nelson Dilipkumar) సినిమా గురించి గత కొద్ది సంవత్సరాలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే కానీ ఇప్పుడు త్రివిక్రమ్ లేదంటే నెల్సన్ ముందా అనే ఒక క్యూస్షన్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ..

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఎన్టీఆర్ ప్రస్తుతం ‘డ్రాగన్’ సినిమాపైనే తన పూర్తి దృష్టిని పెట్టినట్లు తెలుస్తోంది. అయితే, ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. త్రివిక్రమ్, నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ రెండు సినిమాలను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్నారు. మరి ఈ రెండు సినిమాల్లో ఏది ముందు, ఏది తర్వాత అనే విషయంపై ఆసక్తి నెలకొంది.

NTR Next Trivikram God Of War.?

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మొదట త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గాడ్ ఆఫ్ వార్’ (God Of War) సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా ప్రస్తుతం జరుగుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా, ఫిలింనగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాను ప్రస్తుతానికి హోల్డ్‌లో ఉంచాలని చెప్పినట్లు, స్క్రిప్ట్ పూర్తిగా లాక్ అయిన తర్వాతే ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నట్లు ఒక ప్రచారం జరుగుతోంది.

మరోవైపు, దర్శకుడు త్రివిక్రమ్ ప్రస్తుతం వెంకటేష్ హీరోగా తెరకెక్కిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరి ఈ సినిమా విడుదలైన తర్వాత వచ్చిన రిజల్ట్ ని బట్టి ఎన్టీఆర్ తన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి..
ఇక మరోవైపు, దర్శకుడు నెల్సన్ కూడా ప్రస్తుతం టాప్ డైరెక్టర్ల జాబితాలో తన స్థానాన్ని మరింత బలపరుచుకున్నారు. వరుసగా ఐదు సినిమాలతో బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్న దర్శకుల జాబితాలో ఇప్పుడు ‘జైలర్ 2’తో నెల్సన్ కూడా చేరటంజరిగింది.

NTR Next Nelson Dilipkumar Titled Rock.?

అయితే, ‘జైలర్ 2’ విషయానికి వస్తే.. సినిమాలో AI ని ఎక్కువగా ఉపయోగించారని, గ్రాఫిక్స్ అంతగా బాగోలేవని, యాక్షన్ ఎపిసోడ్స్ మరీ ఆర్టిఫిషియల్ గా ఉన్నాయని కొంతమంది ప్రేక్షకులు సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, నెల్సన్‌తో సినిమా చేయొద్దు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మరోవైపు, ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తుండటంతో, ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను నెల్సన్‌తో చేస్తే బాగుంటుందని మరో వర్గం అభిప్రాయపడుతోంది. వరుస యాక్షన్ సినిమాలతో ఎన్టీఆర్‌కు మంచి లైన్‌అప్ ఏర్పడుతుందని, బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించే అవకాశం ఉంటుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మొత్తంగా చూస్తే, త్రివిక్రమ్ అయినా, నెల్సన్ అయినా తమ కథలను పూర్తిగా సిద్ధం చేసి ఎన్టీఆర్‌కు వినిపించిన తర్వాతే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజులు వేచి చూస్తే కానీ, ఈ ఇద్దరు దర్శకుల్లో ఎవరితో ఎన్టీఆర్ ముందుగా సినిమా చేస్తారనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.

ఇక మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ లైన్ అప్ చూసుకుంటే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో గాడ్ ఆఫ్ వార్ దాని తర్వాత నెల్సన్ దర్శకత్వంలో రాక్ సినిమాలోని లైన్ లో పెట్టగా వీటితర్వాత మళ్ళీ రాజమౌళితో సినిమాని కూడా తన లైన్ అప్ లో పెట్టుకున్నారు