Prabhas kalki Sequel Shooting Update: దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు విజయాన్ని నమోదు చేసి దాదాపు 1200 కోట్ల ఓల్డ్ వైడ్ గ్రాస్ ని బాక్సాఫీస్ వద్ద సాధించింది.. అంతేకాకుండా రెండు జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఈ అవార్డులను రెండు రోజుల క్రితమే ప్రదానం చేశారు.

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ మరోసారి రాజుల గెటప్‌లో కనిపించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమాలో ప్రభాస్‌ లుక్ ప్రేక్షకులను, ముఖ్యంగా డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రభాస్‌ను ఆ తరహా పాత్రలో చూసిన అభిమానులు థియేటర్లలో పండగ చేసుకున్నారు.

ఇక ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2) రెండో భాగం కోసం ప్రభాస్ అభిమానులు చాలా కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీక్వెల్‌కు సంబంధించి మధ్యమధ్యలో పలు రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ, దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు మాత్రం వాటిపై పెద్దగా స్పందించకుండా తమ పని తాము చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

సినిమాను ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారమే పూర్తి చేసి, నిర్ణయించిన సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో చిత్రబృందం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ‘కల్కి 2’ ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా, ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని ప్రభాస్ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది.

ఇక ప్రస్తుతం నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌పై (Kalki 2) పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ను అక్టోబర్‌లో ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. గతంలోనే వెల్లడైన వివరాల ప్రకారం, సీక్వెల్‌ మొత్తం చిత్రీకరణను 2027 సుమ్మర్ నాటికి పూర్తి చేయాలని నాగ్ అశ్విన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

సీక్వెల్ షూటింగ్‌లో ప్రభాస్‌తో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కూడా పాల్గొననున్నారు. అలాగే మరికొందరు ప్రముఖ నటీనటులు కూడా ప్రొడక్షన్ ముందుకు సాగుతున్న కొద్దీ షూటింగ్‌లో భాగం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ‘కల్కి 2898 ఏడీ’పై ఉన్న భారీ అంచనాలకు తోడు, సీక్వెల్‌పై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ ఈ ప్రతిష్టాత్మక సీక్వెల్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం భారతీయ సినీ ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.