Dragon Shooting update: జూనియర్ ఎన్టీఆర్ అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ట్రాకింగ్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే.. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గేమ్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలాగే మూవీ లవర్స్ కి ఒక మంచి ట్రీట్ ఇవ్వటమే కాకుండా మరోసారి ప్రశాంత్ నేమ్ టేకింగ్ అండ్ సినిమాటిక్ విజువల్ ఎక్స్పీరియన్స్ ని ఫాన్స్ కి అందించారు.. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్ అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ 800 కోట్ల పైన ఖర్చు చేస్తూ నిర్మిస్తున్నట్టు ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం..
అయితే రీసెంట్గా ఎన్టీఆర్ కి భుజం గాయం కారణంగా రెస్ట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే.. లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకు సంబంధించిన షూటింగు ప్రశాంత్ గత రెండు వారాలుగా హైదరాబాద్లో జరుగుతుందని అలాగే ఎన్టీఆర్ లేని పోషణ్ ని షూట్ చేస్తున్నట్టు చెబుతున్నారు..
అక్టోబర్‌లో షూటింగ్‌లోకి ఎన్టీఆర్?
‘డ్రాగన్’ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ చేతికి స్వల్ప గాయం కావడంతో ఆయనకు చిన్నపాటి సర్జరీ జరిగింది. ప్రస్తుతం తారక్ రెస్ట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే గాయం నుంచి ఆయన వేగంగా కోలుకుంటున్నారని, అక్టోబర్ మొదటి వారంలో తిరిగి షూటింగ్‌లో జాయిన్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
తారక్ అందుబాటులో లేని సమయంలో ప్రశాంత్ నీల్ కూడా షూటింగ్‌ను ఆపకుండా ఇతర కీలక సన్నివేశాలను పూర్తి చేస్తున్నారట. దీంతో షూటింగ్ ఆలస్యాన్ని వీలైనంత వరకు కవర్ చేసేందుకు టీమ్ పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
ముందుగా ప్రకటించిన రిలీజ్ టార్గెట్‌ను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఏడాది జూన్‌లోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
డార్క్ లూగర్.. కలర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్!
‘డ్రాగన్’ గురించి ప్రస్తుతం వినిపిస్తున్న ఆసక్తికరమైన విషయం సినిమా ట్రీట్‌మెంట్. ప్రశాంత్ నీల్ సినిమాలు అంటే డార్క్ విజువల్స్, గ్రే షేడ్స్, మాస్ యాక్షన్ గుర్తుకు వస్తాయి. అయితే ‘డ్రాగన్’లో ఈ స్టైల్‌తో పాటు పూర్తిగా భిన్నమైన ఫ్లాష్‌బ్యాక్‌ను కూడా దర్శకుడు ప్లాన్ చేసినట్లు టాక్.
ప్రస్తుత టైమ్‌లైన్ అంతర్జాతీయ ఓపియం మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎన్టీఆర్ ‘లూగర్’ అనే రూత్‌లెస్ కిల్లర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. డార్క్ షేడ్స్‌తో కూడిన ఈ పాత్రలో తారక్‌ను ప్రశాంత్ నీల్ ఏ రేంజ్‌లో చూపిస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అయితే అసలు సర్‌ప్రైజ్ ఫ్లాష్‌బ్యాక్‌లోనే ఉంటుందని టాక్. లూగర్ గతం.. అసలు కథ అక్కడే!
ఫ్లాష్‌బ్యాక్‌లో లూగర్ క్యారెక్టరైజేషన్ పూర్తిగా భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. కూల్ అండ్ క్లాస్ లుక్‌లో కనిపించే లూగర్‌కు రుక్మిణి వసంత్ పాత్రతో అందమైన లవ్ ట్రాక్ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
అంతేకాదు.. ఈ భాగాన్ని ప్రశాంత్ నీల్ తన గత సినిమాలకు భిన్నంగా కలర్‌ఫుల్‌గా డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. రిచ్ లొకేషన్స్, కలర్‌ఫుల్ కాస్ట్యూమ్స్, అందమైన విజువల్స్‌తో ఫ్లాష్‌బ్యాక్‌ను ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చేలా తెరకెక్కిస్తున్నారట.
ఈ నేపథ్యంలో రుక్మిణి వసంత్‌తో ఎన్టీఆర్‌పై ఓ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ కూడా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది.
అయితే ఈ అందమైన ప్రపంచం ఓ విషాదకరమైన సంఘటనతో పూర్తిగా మారిపోతుందని, ఆ తర్వాత లూగర్ జీవితంలో చోటు చేసుకునే పరిణామాలే అతడిని ఒక క్రూరమైన వ్యక్తిగా మార్చుతాయని ప్రచారం జరుగుతోంది. అక్కడి నుంచి అతడి ప్రయాణం ‘డ్రాగన్’గా ఎలా మారుతుందనేది సినిమాలో కీలకమైన అంశంగా ఉండనుందని టాక్.
ఎన్టీఆర్‌తో భారీ మాస్ సాంగ్?
‘డ్రాగన్’లో ఓ స్పెషల్ మాస్ సాంగ్ కూడా ఉండబోతుందనే వార్తలు ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. రుక్మిణి వసంత్‌తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లతో కలిసి ఎన్టీఆర్ మాస్ స్టెప్పులు వేసేలా ఈ పాటను ప్లాన్ చేశారని ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ సాంగ్, అదనపు నటీనటుల విషయంలో ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
మరోవైపు అనిల్ కపూర్, బిజు మీనన్, ఖుష్బూ కీలక పాత్రల్లో నటిస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. షాహిద్ కపూర్, ఆలియా భట్ కూడా సినిమాలో భాగం కానున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. వీటిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.
నీల్ మార్క్ యాక్షన్ + ఎమోషన్
‘డ్రాగన్’లో కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా బలమైన ఎమోషనల్ లేయర్ కూడా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఒక వైపు డార్క్ మాఫియా బ్యాక్‌డ్రాప్, మరోవైపు కలర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్, లవ్ ట్రాక్, ఆ తర్వాత వచ్చే భారీ యాక్షన్ బ్లాక్స్‌తో సినిమాను చాలా గ్రాండ్‌గా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రశాంత్ నీల్ సినిమాల్లో ఎమోషన్‌ను మాస్ ఎలివేషన్‌తో మిక్స్ చేసే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. ఈసారి ఎన్టీఆర్ వంటి పవర్‌హౌస్ పెర్ఫార్మర్ దొరకడంతో ఆ ఎలివేషన్స్ ఏ స్థాయిలో ఉంటాయనే ఆసక్తి సహజంగానే పెరుగుతోంది.
ప్రస్తుతం ఇవన్నీ సినిమా గురించి వినిపిస్తున్న ఇండస్ట్రీ బజ్, ప్రచారంలో ఉన్న సమాచారం మాత్రమే. మేకర్స్ నుంచి అధికారిక వివరాలు రావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు బయటకు వచ్చిన అప్‌డేట్స్ చూస్తే ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ‘డ్రాగన్’పై అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి