Jailer 2 vs Ranabaali Box office Collection Trend: దసరా సెలవుల సీజన్‌కు నేడు చివరి రోజు కావడంతో ‘రణబాలి’, ‘జైలర్ 2’ సినిమాలకు ఈ రోజు చాలా కీలకంగా మారింది. మొదటి దగ్గర నుండి రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడతానే ఉన్నాయి. రజనీకాంత్ సినిమాకి పాజిటివ్ రివ్యూస్ రాగా మొదటి రోజు విజయ్ దేవరకొండ సినిమాకి నెగిటివ్ రివ్యూస్ తో సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అయ్యాయి అయితే తర్వాత రోజుల్లో విజయ్ దేవరకొండ సినిమాకి ప్రజలు ఆదరణ చూపించడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ప్రతిరోజు పెరుగుతూ వచ్చాయి. ఈ రెండు సినిమాలు థియేటర్లలో కొనసాగుతున్న నేపథ్యంలో అక్టోబర్ 21న బాక్సాఫీస్ వద్ద వాటి పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటించిన ‘రణబాలి’ గంటకు సుమారు 10, 000 టికెట్లు అమ్ముడవుతుండగా దీనిలో హైదరాబాద్ సిటీ నెంబర్ వన్ ప్లేస్ లో దాని తర్వాత విశాఖపట్నం రెండో స్థానంలో టికెట్ బుకింగ్స్ లో ఉంది. ఇక రజనీకాంత్ సినిమాకి వస్తే ‘జైలర్ 2’ గంటకు దాదాపు 30,000 టికెట్లను విక్రయిస్తోంది దీనిలో మొదటి స్థానంలో బెంగుళూరు ఉండగా రెండో స్థానంలో చెన్నై సిటీ ఆ తర్వాత హైదరాబాదు బుకింగ్స్ రెండు అవుతున్నాయి..
విడుదలైన రోజు సినిమాకు ఆశించిన స్థాయిలో రివ్యూలు రాకపోయినా, ‘రణబాలి’ బాక్సాఫీస్ వద్ద కొంతవరకు నిలకడగానే కొనసాగుతోంది. బుక్‌మైషోలో రోజుకు సుమారు లక్ష టికెట్లు అమ్ముడవుతుండటం ఈ సినిమాకు కాస్త ఊరటనిచ్చే అంశం. లాస్ట్ 24 గంటల్లో చూసుకుంటే రణబలి సినిమాకి Book My SHow ద్వారానే దాదాపుగా 1,34000 వేల టికెట్లు బుకింగ్స్ జరిగాయి.
అయితే, ఈ దసరా సీజన్లో అసలైన విజేత ఎవరంటే రజనీకాంత్ అనే చెప్పాలి. ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో దూసుకుపోతోంది. ఓల్డ్ వైడ్ గా ఈ సినిమా 500 కోట్ల గ్రాస్ ఆరు రోజుల్లో దాటగా తెలుగు రాష్ట్రాల్లో కూడా 50 కోట్ల దాటింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లు నేరుగా తెలుగు సినిమాలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నాయి.
‘జైలర్ 2’కు బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో పాటు, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. విజయ్ దేవరకొండ సినిమా కూడా మొదట్నుంచి పాజిటివ్ టాక్ వచ్చినట్లయితే దీనికి మంత్రి కలెక్షన్స్ వచ్చేయమని ట్రేడ్ వర్గాలు అంచినా వేస్తున్నాయి ప్రస్తుతానికి అయితే ఘనబలి సినిమా 50 కోట్లకు ఆరు రోజులు క్రాస్ చేయటం జరిగింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా సాధించిన వసూళ్లతోనే చిత్ర బృందం సంతృప్తి చెందాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
జైలర్ 2 అలాగే రణబలి రెండు సినిమాలు OTT రిలీజ్ అయ్యే ముందు ఎంతవరకు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ నమోదు చేస్తాయో చూడాల్సిందే.. ప్రస్తుతానికైతే రజినీకాంత్ సినిమా రికార్డులను సృష్టిస్తుంది