గత కొన్ని సంవత్సరాలుగా వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న నితిన్ ఇప్పుడు మరో కొత్త దర్శకుడు తో మన ముందుకు రాబోతున్నారు ‘అలియాస్ రుక్మిణి’ (Alias Rukmini) సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ప్రధాన తారాగణంతో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తూ తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు రెండో షెడ్యూల్‌కు సిద్ధమవుతోంది.

యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నాని ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా, మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ ఇంత వేగంగా జరుగుతుండటం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. మొదటి నుంచే మేకర్స్ ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నారు. నితిన్ కూడా సినిమాను నిరంతరాయంగా పూర్తి చేసేందుకు తన బల్క్ డేట్స్ కేటాయించారు. దీంతో పెద్దగా గ్యాప్ లేకుండానే ఒక షెడ్యూల్ తర్వాత మరో షెడ్యూల్‌ను కొనసాగిస్తున్నారు.

నితిన్‌కు ఇటీవల కొంత కఠినమైన ఫేజ్ ఎదురైన నేపథ్యంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా టైటిల్ గ్లింప్స్‌లో కనిపించిన కొత్తదనం, కథలో కీలకంగా ఉండే సంబంధం చుట్టూ ఉన్న మిస్టరీ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి.

తొలి షెడ్యూల్ పూర్తవడంతో, త్వరలో ప్రారంభం కానున్న రెండో షెడ్యూల్‌తో ‘అలియాస్ రుక్మిణి’ తదుపరి దశలోకి అడుగుపెడుతోంది. మరి ఈ షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత సినిమా నుండి ఏదైనా అప్డేట్ ఇస్తారేమో అని నాని అలాగే నితిన్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు ఈ సినిమాతో అయినా నితిన్ తన బాక్సాఫీస్ వద్ద కం బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి